Political Leaders Plane Crashes: బల్వంత్‌రాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకు.. ప్లేన్, హెలికాప్టర్ క్రాష్‌లలో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ నాయకులు వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Leaders Plane Crashes: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు (బుధవారం) విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా విషాద ఛాయలను మిగిలించింది. గత ఏడాది జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే.. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మరో ప్రముఖ జాతీయ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం దేశ రాజకీయ వర్గాలను విషాదంలో ముంచింది. భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ప్రముఖ నేతలు ప్లేన్, హెలికాప్టర్ క్రాష్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కూడా.
భారతదేశంలో విమాన ప్రమాదంలో మరణించిన తొలి ప్రముఖ రాజకీయ నేతగా బల్వంత్‌రాయ్ మెహతా గుర్తింపు పొందారు. ఈయన 1963 నుంచి 1965 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. 1965 భారత్, పాక్ యుద్ధ సమయంలో కచ్ రణ్ ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు ఆయన భార్య, ముగ్గురు సిబ్బంది, ఒక జర్నలిస్ట్, ఇద్దరు విమాన సిబ్బంది మృతి చెందారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమానం నడపడంపై ఆసక్తి కలిగిన సంజయ్ గాంధీ.. ఒక స్టంట్ ప్రదర్శించబోయే క్రమంలో విమానం కూలిపోవడంతో ఆయనతో పాటు మరోవ్యక్తి సుభాష్ సక్సేనా మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాధవరావ్ సింధియా 2001 సెప్టెంబర్ 30న విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్తుండగా మైన్పురి సమీపంలోని మోటాగావ్ వద్ద ఆయన విమానం కూలిపోయింది. అప్పటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు.
లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.ఎం.సి. బాలయోగి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో బాలయోగితో పాటు ఆయన భద్రతా అధికారి డి. సత్య రాజు, పైలట్ కెప్టెన్ జి.వి. మేనన్ అక్కడికక్కడే మృతి చెందారు.
Ajit Pawar: సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
2009లో జరిగిన మరో ఘోర ఘటనలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
2011లో విమాన ప్రమాదంలో డోర్జీ ఖాండు (అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి) మృతి చెందారు. తవాంగ్ నుంచి రాజధాని ఇటానగర్‌కు వెళ్తుండగా ఆయన విమానం మిస్ అయ్యింది. అయితే ఆ తరువాత శిథిలాలు లభ్యమయ్యాయి. అప్పటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు.
ఇక ఇటీవలి కాలంలో 2025 జూన్ 12న విజయ్ రూపాణి (గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి) అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
ఇప్పుడు ఈ జాబితాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేరు కూడా చేరింది. వరుసగా జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు భారత రాజకీయ చరిత్రలో చెరగని విషాద అధ్యాయాలుగా మిగిలిపోతున్నాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!