తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రానున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో.. అలాగే, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
Amit Shah: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Elections 2024: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులకు రూ.53.5 లక్షలు పట్టుబడ్డాయి.