హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మొఖాసిగూడ గ్రామంలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం విరిగిపడింది. ఉరుముల ,మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈదురు గాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పిడుగు పాటుకు చెట్లు నేలరాలాయి.
READ MORE: T. Harish Rao: మంత్రికి మతిభ్రమించింది.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
కాగా.. సాయంత్రం 6 గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. 50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను అలెర్ట్ చేసినట్లు ఐఎండీ తెలిపింది.