క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు, తోటి స్టాఫ్‌తో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ-కేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. సాంకేతిక లోపంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కేకే ఫామ్‌హౌస్‌లో కమ్మరి కృష్ణను కొందరు దుండగులు దారుణంగా హత్యకు చేశారు.
Food safety: టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పందించింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.
గ్రూప్ 2 పోస్టులను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలని గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్-2 అభ్యర్థులు మాట్లాడారు.