* తిరుమల: ఇవాళ పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఉరేగునున్న శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. 18వ తేదీన శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దు
* వరంగల్: నేడు తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్.. రాష్ట్రం అంతటా ఓపీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన జూడాలు.. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య ఘటనకు నిరసనగా ఓపీ సేవలకు దూరంగా జూడాలు
* అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వంశీ.. ఈ రోజు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు
* ప్రకాశం : టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో పలువురు అధికారులతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్షా సమావేశం..
* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరులో జరిగే మండల పరిషత్ సరసభ సమావేశంలో పాల్గొంటారు అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
* నెల్లూరు: రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విజయనగరం: నేడు జాతీయ త్రివర్ణ పతాక ఊరేగింపు (తిరంగ ర్యాలీ) కార్యక్రమం..
* విజయనగరం: భారతీయ జనతాపార్టీ యువమోర్చా, ఆధ్వర్యంలో విజయనగరం తోటపాలెం శ్రీనివాస జూనియర్ కాలేజ్ ర్యాలీ ప్రారంభం.. తోటపాలెం, మయూరి జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, బాలాజీ జంక్షన్ రోడ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనున్న ర్యాలీ..
* నేడు సాయంత్రానికి కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేయనున్న పవన్
* తూర్పుగోదావరి జిల్లా: సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకోనున్న మంత్రి కందుల దుర్గేష్.. సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి కలెక్టరేట్‌లో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు.. రాత్రి 7 గంటలకు కడియం G.N.R కన్వెన్షన్ హాల్‌లో ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన..
* విశాఖ: రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రెండు రోజుల పర్యటన…
* అనంతపురం : పెద్దవడుగూరు మండలం కొండుపల్లి గ్రామంలో యస్వి మినరల్స్ బలపం పౌడర్ క్వారీ తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ.
* అనంతపురం జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలొని శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయంలో అష్టబంధన జీర్ణోద్దరణ, మహాకుంభాభిషేకం కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలో హర్ ఘర్ తిరంగా పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ.
* అనంతపురం : గుంతకల్ పట్టణంలోని ఎస్ ఎస్ ట్యాంక్ లోకి హంద్రీనీవా ద్వారా నీటిని విడుదల చేయనున్న అధికారులు.
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించనున్న మంత్రి సవిత.
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో : 1,33,688 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 68,453 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* ప్రకాశం బ్యారేజీ 50 గేట్లను మూసివేసిన అధికారులు.. సముద్రంలోకి 14,600 క్యూసెక్కుల విడుదల, కాలువలకు 16,057 క్యూసెక్కుల విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 30,657 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట 12 అడుగులు.. 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తిన అధికారులు