AP Govt: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు..!
- తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు..
- రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపేలా ఆదేశాలు..
- రిలీవ్ అవుతున్న ఉద్యోగులు కేడర్లోని చివరి ర్యాంక్లో మాత్రమే విధుల్లో చేరతారు: ఏపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ సర్కార్ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణాకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్ల ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేర్కొనింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
Read Also: Richard Lugner: ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లుగ్నెర్ కన్నుమూత.. ఇటీవలే 6వ పెళ్లి చేసుకున్న రిచర్డ్
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ఇక, దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న తెలంగాణ/ఏపీ ఉద్యోగుల బదీలపై నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుమూడిని కూటమి ప్రభుత్వం విప్పిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. సీఎం చంద్రబాబుకు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి వలిశెట్టి దామోదర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Go
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!