రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జీఏడి అధికారులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.