హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు బుధవారం రాత్రి ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి.
తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్లైన్లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.
Sundeep Kishan Hotel: గత కొద్ది నెలల నుండి తెలుగు రాష్ట్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లు, చిన్న హోటలలో తనిఖీలు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే తాజాగా హీరో సందీప్ కిషన్ పార్ట్నర్ గా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లలో హోటల్లో నాసరికం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్, హోటల్స్, ఫుడ్…