రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో.. రేపట్నుంచి తెలంగాణలో రైతు భరోసా సదస్సులు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రేపటి నుంచి 22 వరకు వర్క్ షాప్ జరుగనుంది. ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు.
ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు.
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు.