* మహిళల వన్డే వరల్డ్ కప్: నేడు శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్.. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ.. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపైనా చర్చించే అవకాశం * నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావు.. హైకమాండ్ పెద్దలతో భేటీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చ * విజయవాడ:…
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే…
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడ్ కోసం రాంప్లను ఉపయోగించి…
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్…
ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000…
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం…
యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న…
AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను…
డయల్ 100కు ఫోన్.. సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్..! లిక్కర్లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు…
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించనుంది . అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం…