రైల్వే గేటు దాటే క్రమంలో పలు వాహనాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొందరు నిర్లక్ష్యంగా రైల్వే గేటు దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైల్వే సిబ్బంది విదుల్లో నిర్లక్ష్యం కారణంగా కూడా రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం తప్పింది. పెద్దపల్లి పట్టణ సమీపంలోని కూనారం రైల్వే గేట్ వద్ద ఓ కారు రైల్వే పట్టాలపై ఆగిపోయింది. కారు గేటు దాటకముందే రైల్వే సిబ్బంది గేటు వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read:Akhanda2 Thaandavam : 14 రిల్స్ కు తీర్పు అనుకూలంగా వచ్చిన రిలీజ్ కష్టమే
అయితే కారును పంపించేందుకు గేటును ఓపెన్ చేయాలని చూసిన సిబ్బందికి షాక్ తగిలింది. రైల్వే గేట్ లాక్ అయిపోయింది. సాంకేతిక లోపంతో రెండు వైపులా గేట్ లాక్ అయింది. కారు మధ్యలోనే ఉండటంతో లాక్ తీసేందుకు సిబ్బంది హైరానా పడ్డారు. లాక్ ఓపెన్ చేసే దిశగా మరమ్మత్తులు చేపట్టారు రైల్వే సిబ్బంది. పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. గతంలోనూ గేట్లు లాక్ కావడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి.. రైళ్లు ఆగిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.