Krishnaiah: బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశాను అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నాను.. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయ బద్ద వాటా వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు.
BRS Working President: మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది.. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు.
R. Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమావేశం అయ్యారు. విద్యా నగర్లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ రవి, కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు.
HYDRA Demolition: మూసీ నది వైపు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ లో మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Chicken Price: మాసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొన్నటి వరకు కాస్త దిగి వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
Minister Seethakka: నేడు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఏటూరునాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.