Harish Rao: అ’శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ..
- అ'శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ..
- విద్యార్థులతో మాట్లాడి వారి ఆవేదనను మీరు వినండి..
- మీ ప్రజా ప్రభుత్వం స్టూడెంట్స్ పై కర్కశంగా వ్యవహరించింది: హరీశ్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రాహుల్ గాంధీ మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లోని నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. మీ సో-కాల్డ్ ప్రజా పాలనలో విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది.. ఈ దారుణాలు మీకు తెలుసా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి అని ఆయన ఎద్దేవా చేశారు. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.. ప్రక్షాళన సంగతి దేవుడెరుగు.. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు అని హరీశ్ రావు మండిపడ్డారు.
Read Also: KA : దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు.. కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది అని హరీశ్ రావు విమర్శించారు. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం లాంటి హామీల ఊసు కూడా లేదు.. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది.. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.
Telangana’s youth have been misled by @RahulGandhi ji and his party.
Rahul Gandhi ji, are you aware students were beaten by your ‘Prajala Sarkar’ at the very place you visited?
Less than 10% of the promised 2 lakh jobs have been delivered, and the so-called ‘revamped TSPSC’ is… https://t.co/2LSdJ4gBTr pic.twitter.com/qogwk9oh6l
— Harish Rao Thanneeru (@BRSHarish) November 5, 2024
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!