Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ కు రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి (బుధవారం) నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్లో నిర్వహిస్తున్న సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. అందులో బలహీనుడి గళం. సామాజిక న్యాయ రణం.. రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ రాసుకొచ్చారు.
Read Also: Home Minister Anitha: పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన హోం మంత్రి అనిత.. ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, రాహుల్ గాంధీ పాల్గొననున్న ఈ మీటింగ్ కు మీడియాకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన లైవ్ సిగ్నల్స్ యొక్క లింక్ ను పీసీసీ తరఫున మీడియాకు అందుబాటులో ఉంచుతామని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ కేవలం 400 మందితో భేటీ కానున్నారు. ఇక, ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. మరో 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
బలహీనుడి గళం…
సామాజిక న్యాయ రణం…
శ్రీ రాహుల్ గాంధీకి స్వాగతం. pic.twitter.com/7xtwcdf79P— Revanth Reddy (@revanth_anumula) November 5, 2024