పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు.
Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు.
IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.