అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్కు వెళ్ళాల్నా? అవసరం లేదా? ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీభవన్ ముఖం చూడ్డం కూడా మానేశారట. పవర్లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
Dana Kishore: మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తెలిపారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు.. బిల్లులు రాక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారు.