Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. అయితే.. ప్రస్తుత కాలంలో వస్తున్న వెయ్యి రూపాయల కనిష్ట పెన్షన్ ఏ మూలకూ సరిపోవడం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది ఈపీఎస్-95 (EPS-95) పెన్షనర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
రూ. 7,500లకు పెన్షన్ పెంపు..?
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ మేరకు, కనిష్ట పెన్షన్‌ను ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి రూ. 7,500లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో.. దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సామాన్యులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద వరం కానుంది.
ముఖ్యమైన మార్పులు ఇవే..
ఈపీఎఫ్ఓ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. త్వరలో ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ద్వారా కాగితపు పని తగ్గించి, వేగంగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయోజనం ఎవరికి..?
పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుంది. కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా, పీఎఫ్ నగదును సులభంగా పొందేలా చేస్తున్న మార్పులు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచుతాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త కోట్లాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?