KTR: ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఆటో డ్రైవర్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి ఆటో లో వచ్చాను.. తమ జీవితాలన్ని అస్తవ్యస్తంగా అయ్యాయని నేను ఎక్కిన ఆటో డ్రైవర్ అన్నారు.. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగే ఉంది.. ఇవాళ రాహుల్ గాంధీ వస్తున్నారు.. ఇదే రాహుల్ గాంధీ గత ఏడాది ఆటోలో జనాల దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్పారు.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే,ఇంటింటికి సంక్షేమం అన్నావు.. అత్తలకు, కోడళ్ళకు పైసలు ఇస్తాన్నావు.. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఇస్తే మేము వ్యతిరేకం కాదు.. రైతుల ఆత్మహత్యలు మొదలైనాయి.. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు.
Read Also: Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే.. ఆలంగీర్ ఆలం కూడా అంటూ సీఎం యోగి ఫైర్
ఇక, అసెంబ్లీలో వివరాలు పెడితే మమ్మల్ని విమర్శించారని కేటీఆర్ అన్నారు. ఆడ పిల్లలు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో కొట్లాడుకోకుండా చూడండి.. ఆటో డ్రైవర్లు చవకుండా ఉండేలంటే సంవత్సరానికి 12 వేలు కాదు.. నెలకు 5వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రభుత్వమే ఇవ్వాలి.. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్స్యూరెన్స్ కూడా రద్దు చేశారు.. సచివాలయంలో ఉన్న అధికారులకు వినిపించేలాగా విజిల్ వెయ్యాలి.. అలాగే, మీకోసం వచ్చిన వాళ్లకు వ్యతిరేకంగా మీరు మాట్లాడటం సరినది కాదు.. పోలీసులు కూడా ఎక్కువ మంది రాకుండా కట్టడి చేశారు.. పోలీసులు కూడా కష్టంలోనే ఉన్నారు.. వాళ్లు రోడ్ ఎక్కారు.. డ్యూటీ చెయ్యండి.. కానీ పేదల పట్ల కనీసం ఆలోచన చేయాలని కోరారు. పోలీసులన్నలకు విజ్ఞప్తి స్పెషల్ పోలీసులను నమ్మడం లేదు.. సచివాలయంలో స్పెషల్ పోలీసులను తీసేసి బెటాలియన్ దింపాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Read Also: Varuntej : ‘మట్కా’పైనే వరుణ్‌తేజ్ ఆశలన్నీ.. హిట్టు దక్కేనా..?
ఇక, మాకు ఆటో డ్రైవర్ల కెపాసిటీ తెలుసు.. మమ్మల్ని ఓడగొట్టడంలో మీ పాత్ర ఉంది.. ఈ ప్రభుత్వాన్ని ఇంకా నాలుగేళ్లు భరించాలని కేటీఆర్ అన్నారు. ఈ నాలుగేళ్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. అన్ని జెండాలు ఒక్కటై… పోరాటం చేయ్యాలి.. ఏఐటీయూసీ, ప్రభుత్వంతో కలిసి ఉంది అయినా కూడా పోరాటం కోసం రోడ్డు ఎక్కారు.. CITU లాంటి సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మిక సంఘాల ఐక్యంగా పోరాడాలి.. మా పూర్తి మద్దతు మీకు ఇస్తున్నాం.. మా బీఆర్టీయూ సంఘంతో కలిసి మీరు చేసే ప్రతి పోరాటంలో మేము ఉంటాం.. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కోసం మనం నినదించాలి.. అంటూ అందరితో కలిసి కేటీఆర్ స్లొగన్స్ ఇచ్చారు.