కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు.. మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు.
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా * నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన * హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ * ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్…
ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. సమస్యల పుట్ట ధరణి పోర్టల్ అని.. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నామన్నారు. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయని తెలిపారు.
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ దరఖాస్తులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల…
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు భక్తులకు షాకిచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.