Jagtial Crime: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు సంతోష్ అక్కడ అధికారులకు తానే గంగారెడ్డి హత్య చేసినట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నేడు ఏపీ కేబనెట్ భేటీ.. కీలక అజెండాపై చర్చ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక,…
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రేపు దానా తుఫాన్ తీరం దాటనుంది. ఏపీ సహా మూడు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది.
* రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. బ్రిక్స్ సమ్మి్ట్లో భాగంగా నేడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బ్రిక్స్ సమ్మిట్లో జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోడీ. * నేడు వయనాడ్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్రెడ్డి తదితర నేతలు.. * అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ..…
తెలంగాణ గ్రూప్ వన్ ఎపిసోడ్లో వెనుకబడ్డామని బీఆర్ఎస్ ఫీలవుతోందా? ఆ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేయగలిగిందని, తాము ఇంకొంచెం యాక్టివ్ అవగలిగితే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోందా? అందుకే కరెంట్ ఛార్జీల విషయంలో అలర్ట్గా ఉండాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందా? క్రెడిట్ వార్లో గులాబీ దళం ఎక్కడుంది? ఆ పార్టీ అధిష్టానం మనసులో ఏముంది?
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రేపటి నుంచి పలువురు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ ను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉంది.
TPCC vs Jeevan Reddy: కాంగ్రెస్ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని నమ్మకంగా ఉన్న మారు గంగారెడ్డి వ్యక్తిని జాబితాపూర్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి కత్తులతో పొడిచి హతమార్చడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.