ఎమ్మెల్సీ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా ? మండలిలో ఖాళీ అవ్వబోతున్న సీట్లకు డిమాండ్ పెరిగిందా ? కొందరు కేబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నారా ? మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు...ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడిన, సీట్లు త్యాగం చేసిన వారికి...పార్టీ గుర్తింపు ఇస్తుందా ? రేసులో ఉన్న నేతలు ఎవరు ?
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.