ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు.
CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో చేరుకున్న సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు.
కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.
రాజకీయాలు, రైతులు, చెరుకు పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రాయికోడ్ మండలం మాటూరు గ్రామంలో, గొదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.
కోటి దీపోత్సవం నేపథ్యంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొంది గ్రేటర్ ఆర్టీసీ.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని 18 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ప్రకటించింది.. ఆ వివరాల కోసం.. 99592 26160, 99592 26154 మొబైల్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది..