Half Day Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే నడుస్తాయి.
Telangana: కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. నేటి నుంచి ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.
CM Revanth Reddy : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.