తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు గతంలో స్పందించారు. శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే.. చెల్లుబాటు కావని స్పష్టమైంది. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పలు ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి.
READ MORE: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
దీంతో తాజాగా టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలించింది. మిత్ర, సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదనుకుంది. బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతిస్తారు.
READ MORE: Japan: జపాన్ ప్రధాని నివాసంలో ‘‘దెయ్యాలు’’.. ఈ ఇళ్లు అంటే ఎందుకు అంత భయం..?