తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ‘మార్వాడి గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మార్వాడి గో బ్యాక్ జేఏసీ చైర్మన్గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఎన్నికయ్యారు. పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ… మార్వాడీలకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే భౌతిక దాడులే అని…
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం తెలిపింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తంగా 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. Also Read: Harish Rao: రేవంత్ చీఫ్ మినిష్టర్ కాదు, కటింగ్…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ జేబులో కత్తెర పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కట్ చేస్తున్నాడని విమర్శించారు. రిబ్బన్ కత్తిరించడం లేదంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు కట్ చేయడమే రేవంత్ పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిందని చెబుతున్న సీఎం రేవంత్.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరంకి…
దగ్గు సిరప్ ప్రస్తుతం దేశంలో మృత్యువుగా వెంటాడుతోంది. దగ్గు సిరప్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో నలుగురు పిల్లలు ప్రాణాలు వదిలారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా చిన్నారులు చనిపోయారు.
Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సమస్యలపై సీసీఐ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం అయ్యారు.
బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు.