తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ పంచాయతీల్లో మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచింది..
Also Read:Nidhi Agarwal: నిధి అగర్వాల్’తో అసభ్య ప్రవర్తన.. వారిపై కేసు నమోదు?
బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశారన్నారు. 4221 సర్పంచ్ లను బీజేపీ బీఆర్ఎస్ కూటమి గెలుచుకుందన్నారు. 33 శాతం గెలుచుకున్నారని తెలిపారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్ తెలిపారు. కంటోన్మెంట్.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. 94 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 87 నియోజక వర్గాల్లో మెజారిటీ సాధించింది.. BRS 8 నియోజక వర్గాల్లోనే మెజార్టీ సాధించింది.. 94 లో.. కాంగ్రెస్ 87 నియోజక వర్గాల్లో విజయం సాధించిందని తెలిపారు.
ఇంకో 21 శాసన సభ నియోజక వర్గాల్లో ఎక్కువ గెలిచాం.. ఉప ఎన్నికలు వస్తె రెండిట్లో గెలిచాం.. రాష్ట్ర స్థాయిలో.. రెండేళ్ల లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించారన్నారు. సన్నబియ్యం.. రేషన్ కార్డులు.. బోనస్.. రుణమాఫీ.. ధాన్యం కొనడం.. 200 యూనిట్ ల ఉచిత విద్యుత్.. ఇందిరమ్మ ఇల్లు లాంటివి కలిసి వచ్చాయన్నారు. మాదిగ..మాల ఉప కులాల సమస్య పరిష్కారం.. 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం.. పేదలకు నాణ్యమైన విద్య అందించే పనికి.. స్వేచ్ఛగా ప్రజలు వాళ్ళు ఓటేసుకున్నారని వెల్లడించారు.
Also Read:YS Jagan: అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వాళ్లను జైల్లో పెడతాం..! జగన్ సంచలన వ్యాఖ్యలు
ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. సోనియా గాంధీ..రాహుల్ గాంధీలపై కేంద్రం అక్రమ కేసులు పెట్టింది. కోర్టులు కూడా చివాట్లు పెట్టినా మారడం లేదు అని రేవంత్ ఫైర్ అయ్యారు. బాధ్యతగా మేం పని చేస్తాం.. ఎదిగినా కొద్ది ఒదిగి ఉంటామన్నారు. మూసిలో కాలుష్యం కంటే ఆయన మాటల్లో విషం ఎక్కువ కనిపిస్తుందన్నారు. బరితెగించిన విధానంతో ఇబ్బంది పెడతాం అంటే కుదరదన్నారు. ఈ ఫలితాలు చూసి సంతోష పడుతున్నాం.. 2029 లో కూడా ఈ తీర్పు పునరావృతం అవుతుందని తెలిపారు. అహంకారం.. అసూయ తగ్గించుకోండి.. బాధ్యతాయుత ప్రతిపక్షం గా ఉండండని సూచించారు.
జీడీపీ.. పర్ క్యాపిటా లో నంబర్ వన్ లో ఉన్నామని తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని రాజకీయ పార్టీగా అభిప్రాయం చెప్పడం సరికాదన్నారు. సభలో మా సంఖ్య 37 అని హరీష్ చెప్పాడు.. MLA ల జీతాల లో వాటా తీసుకున్నప్పుడు ఏమైందని ప్రశ్నించారు. మీ MLA లను కూడా మా MLA లు అని చెప్పుకోలేక పోతున్నారని బీఆర్ఎస్ ను ఎద్దేవ చేశారు. కెసిఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. గజ్వేల్ లో మెజార్టీ సర్పంచ్ లు మేమే గెలిచామన్నారు. ఆయన వల్ల ప్రయోజనం లేదని మాకు మెజార్టీ ఇచ్చారని రేవంత్ తెలిపారు. కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని చెప్పండని అన్నారు. కృష్ణా.. గోదావరి పై మూడు రోజుల చర్చ పెడదాం.. సమ్మక్క సారలమ్మ కి నికర జలాల కూడా సాధించలేదు.. కెసిఆర్ తో చర్చకు నేను సిద్ధం అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు.