సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న 8 నెలలకే భర్త, అత్త ,మామ దాడిలో తీవ్రగాయాలతో అనూష(20) యువతి మృతి చెందింది.
Also Read:Rajeev Shukla-BCCI: మ్యాచ్ రద్దుపై ఫాన్స్ ఫైర్.. స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్!
8 నెలల క్రితం అనూష, పరమేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేశ్ తల్లిదండ్రులకు అనూష కు మధ్య తరచు గొడవలు తలెత్తాయి. ఈ గొడవలో భర్త జోక్యం చేసుకొని అనూష పై ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనూష తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష ప్రాణాలు కోల్పోయింది. అనూష మృతిచెందిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి భర్త పరమేష్, అత్తమామ లాలమ్మ ,మొగులప్ప ముగ్గురు నిందితులు పరారయ్యారు. పలుమార్లు వరకట్నం తేవాలంటూ నా బిడ్డతో గొడవకు దిగారంటు అనూష తల్లి చంద్రమ్మ ఆరోపించింది. కూతురి మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.