Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు.
Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం తెల్లవారుజామున తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
MLA Sticker : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్…
సెక్రటేరియట్లో బిల్డ్ నౌ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన సమగ్ర భవనాలు , లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ బిల్డ్ నౌ.