Minister Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలతో నిర్మించిన మోడల్ హౌస్ ఎలా ఉంది .. మోడల్ హౌస్ లో ఉన్న వసతులు గురించి అధికారులకి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదోడి కల పదేళ్లుగా నెరవేర లేదు.. ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 25 లక్షల ఇళ్లు కట్టిన చరిత్రలో కాంగ్రెస్ ది అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తోంది అని ఆయన తెలిపారు. ఇక, ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్ల కొట్టింది అని ఆరోపించారు. పేదవాడు ఇబ్బందులు పడవద్దని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచన.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
Read Also: Kiran Kumar Reddy: వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇక, ప్రతి అసెంబ్లీకి 3500 ఇళ్లను ఇస్తున్నాం.. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి పేద వాడికి ఇవ్వనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెలలోనే మోడల్ హౌస్ కి శంకుస్థాపన చేశా.. ఈ రోజు ప్రారంభించి పాలు పొంగించాం.. పేద వాడి చిరు కోరిక నెరవేరుస్తాం.. ఈ ఐదేళ్లల్లో ఎన్ని కుతంత్రాలు జరిగిన పేద వాడికి గూడు కట్టిస్తామని ఆయన అన్నారు. పదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం సరిగ్గా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు.. గత ప్రభుత్వం అసంపూర్తిగా చేపట్టిన ఇళ్లను మంచిగా చేసి ఇస్తున్నాం.. పార్టీలకతీతంగా ఇండ్లను ఇస్తామని వెల్లడించారు. మీరు ఏ పార్టీ అని అడుగం.. మా పార్టీకే ఓట్లు వేయమని అడుగాం.. అలాగే, దళారుల పాత్ర ఉండదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Read Also: Indira Bhawan : జనవరి 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా
అలాగే, రేషన్ కార్డు అనేది అర్హత కాదు.. పేదవాడు అనేది మాత్రమే అర్హత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇళ్ల పథకం కొనసాగుతుంది. జనవరి 26వ తేదీన రైతు భరోసా ఇస్తున్నాం.. వరి వేస్తే ఊరి అని ఆనాటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. కానీ, మా ప్రభుత్వం రైతులే ప్రభుత్వానికి వెన్నుముక అని చెబుతుంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. రైతు భరోసాకు రూ. 12 వేలు ఇస్తుందన్నారు. భూమి లేని పేదలకు కూడా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 12 వేల రూపాయలు ఇచ్చే పథకం రేవంత్ సర్కార్ ఇవ్వనుంది.. 20 లక్షల ఇళ్లు ఈ నాలుగేళ్లలో కడుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.