ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి…
వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
“మన రోడ్లను నిర్మించింది మన సంపద కాదు... మన సంపదను నిర్మించింది మన రోడ్లు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్నారు. ఒక దేశాభివృద్ధిలో రహదారుల ఎంత కీలకమో ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ ఏడాది క్రితం కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మండలాల నుంచి జిల్లాలను కలిపే రహదారులు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానిని కలిపే రాష్ట్ర రహదారులు, వివిధ జిల్లాల మీదుగా ప్రయాణించే జాతీయ…
జీనోమ్ వ్యాలీలో రూ. 2వేల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని.. మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేయబోతున్నట్లు తెలిపారు. MSME పాలసీని మరింత పటిష్టంగా తెచ్చామని.. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుందని వివరించారు.
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
Medicine: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని చెత్తకుప్పలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్ దర్శనమిస్తుంది. తెలంగాణ సర్కార్ పంపిణీ చేసిన మందులు, మాత్రలు తదితర వైద్య సామాగ్రిని మహారాష్ట్రలోని లకడ్ కోట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసిందన్నారు. పెద్దపల్లిలో రూ.1500 కోట్ల అభివృద్ధి చేశాం.. ఒక్క ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరికొన్ని నియామకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయన్నారు.