గత ప్రభుత్వం చేయని పనులను మనం చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారిగా రూ. 1035 కోట్ల పనులను మంజూరు చేసుకున్నాం.. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవడానికి కారణం.. ఆరోజు మీరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలవడమే అందుకు కారణం అని చెప్పుకొచ్చారు.
TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
TG Police Dept: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. గోశామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్ కి ఈవెంట్స్ నిర్వహించిన అధికారులు.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
Wazedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక విషయాలను పోలీసులు తెలిపారు. ఎస్ఐ హరీశ్ ను ఓ యువతి బ్లాక్ మెయిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
Google- Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది.
Jupally Krishna Rao: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆరోపించారు.