TG High Court Jobs: 10th పాసైతే చాలు.. హైకోర్టులో జాబ్స్ మీకోసమే.. కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది!
- తెలంగాణ హైకోర్టులో 1673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
- టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు
- దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31 2025
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ వేటలో పడిపోతుంటారు యువతీ యువకులు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లలో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాల్లాగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వందల్లో పోస్టులుంటే లక్షల్లో పోటీపడుతున్నారు. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రయత్నిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ ను సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.
రీసెంట్ గా తెలంగాణ హైకోర్ట్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1673 పోస్టులను భర్తీ చేయనున్నది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్-టెక్నికల్ పోస్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
అభ్యర్థుల వయసు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600 చెల్లించాలి. ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం tshc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!