ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అయ్యింది.. ఏపీ ఐఐసీ కార్యాలయానికి ఒకే కారులో వచ్చారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది..
TS High Court: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల, హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ అందజేశారు.
Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై Ntvతో మృతురాలు భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరమేశ్ తమను చంపుతాడని తెలుసు.. కులంతర వివాహం చేసుకోవడంతోనే అతను నాగమణిపై కక్ష్య పెంచుకున్నాడని పేర్కొన్నాడు.
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో జరుగుతున్న సమావేశం ఇదే. ఏ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఏపీ పునర్వవ్యస్థీకరణ…
Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేటకు వెళ్లనున్నారు.
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, ఈ రోజు (డిసెంబర్ 2) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Maoist: తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.