Tiger Search Operation: కొమురం భీం జిల్లాలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం దగ్గర్లోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. తెలంగాణా సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో హాస్టల్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
CM Revanth Reddy: ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్ళే నాయకులు ఆ పార్టీని విమర్శించడం, పరిస్థితినిబట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నాడన్న ఫీలర్ రాగానే... ముందే బహిష్కరించడమో... లేదా పొమ్మనకుండా పొగబెట్టడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో, లేక ఫలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్ళనో... రకరకాల చర్చలు జరుగుతుంటాయి పొలిటికల్ సర్కిల్స్లో.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ మంగళగిరిలో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు పాల్గొని సుమారు రెండు గంటల పాటు చర్చించారు. పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. పలు అంశాలు ఏటూ తేలక పోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించి భేటీని ముగించారు. అయితే, తెలుగు రాష్ట్రాల విభజన…