Raghunandan Rao: లోక్ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. కుల గణన గురించి గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
కులగణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
PM Letter: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కి సంతాప సందేశాన్ని పంపారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ లేఖను రాసారు. ఈ లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీమతి చీటి సకలమ్మ గారి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఈ అనుకోని…
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే…
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది.. బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.. ఆ తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి.