Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివరాల విషయమై లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు (Unstarred Questions) ఇప్పటివరకు సమాధానాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(1) ప్రకారం, శాసనసభ్యులు అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలను సభా టేబుల్‌పై అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని హరీశ్ రావు లేఖలో గుర్తు చేశారు.
Read Also: KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
అయితే, గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, నియోజకవర్గం ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ప్రశ్నలు అడగడం, వాటికి సకాలంలో సమాధానాలు పొందడం శాసనసభ సభ్యుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని హరీశ్ రావు స్పీకర్‌ను అభ్యర్థించారు.
Read Also: Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు