Komatireddy Venkat Reddy : తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని, ఇకపై ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CPL) సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల భూమికపై…
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి.…
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం…
Narasapur: నర్సాపూర్ టౌన్లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది. ప్యారానగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట…
Road Transport and Highways: జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” ద్వారా కీలకమైన మైలిస్టోన్లు సాధించినందుకు గాను తెలంగాణ రాష్ట్రం అదనపు ప్రోత్సాహక సహాయం పొందింది. ఈ పథకం కింద తెలంగాణకు మొత్తం 176.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించబడింది. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 లో భాగంగా 51.5 కోట్లు, మైల్స్టోన్ 2 లో 125 కోట్లు అర్హత సాధించింది. అంతేకాక, మోటార్ వెహికల్ టాక్స్…
తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. మరో 19 పెండింగ్లో ఉన్నాయి. కానీ... ప్రకటించిన జిల్లాల్లో సమతౌల్యం కనిపించటడం లేదన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో.
తెలంగాణ కాంగ్రెస్ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ... దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఎఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట. పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని, ఓ మంత్రిని రోడ్డుకీడ్చే పని చేశారన్న ప్రచారం జరుగుతున్నా... అసలు అందులో వాస్తవం ఎంత? ఏం జరిగిందన్న సంగతిని పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో.