Hydra Commissioner: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఆపై హైడ్రా కమిషనర్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ముచ్చటిస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో “తెలుగు వచ్చా?”…
POCSO Case: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని బాలికపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు…
Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్…
DK Aruna : ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల కితం షాద్‌నగర్‌లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుంచి దూకి మృతి చెందగా, తాజాగా బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని…
గులాబీ బాస్ కేసీఆర్... ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చేశారు. నేనేదో..... ఫామ్‌హౌస్‌లో కామ్‌గా ఉన్నానని అనుకుంటున్నారేమో... కో....డ్తే...... మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారాయన.
తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలపై యూజీసీ కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని కాలేజీలపై సీరియస్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా 18 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.