Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్దీ..
- పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టులు..
- ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Recruitment 2026: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 జాబ్ క్యాలెండర్లో పోలీసు, అనుబంధ విభాగాలకు సంబంధించిన పలు పోస్టులు ఉన్నాయి. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది..
మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 438 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ విభాగంలో 253, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా.. 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉంది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ 285, ఫైర్ అండ్ ప్రిజన్స్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. తాజా జాబ్ క్యాలెండర్ వివరాల్లో పోలీస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు 200గా, పోలీస్ డ్రైవర్ పోస్టులు 198గా పేర్కొన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 150 పురుష వార్డర్, 21 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి. పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 198 డ్రైవర్లు, 15 మెకానిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్యలు AP 2026 జాబ్ క్యాలెండర్‌లోనూ నమోదయ్యాయి. ఇక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయాలజీ/సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి. అదనంగా పోలీస్ శాఖలో ఇతర సాంకేతిక పోస్టులు కూడా జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..