కరీంనగర్లో పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ - నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అంజిరెడ్డి.. 'విద్య, ఉపాధి, సంక్షేమం' గ్రాడ్యుయేట్లకు అంజిరెడ్డి భరోసా పేరుతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో - 2025 రిలీజ్ చేశారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరోసారి బీజేపీని గెలిపించిన…
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు, చేర్పులు కూడా ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవాలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి.
కరీంనగర్లో జరగనున్న పట్టభద్రుల సంకల్ప యాత్రకు రండి.. తరలిరండి.. అంటూ బీజేపీ పిలుపునిచ్చింది.. ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ - నిజామాబాద్ పట్టభద్రుల ఓటరు లారా.. మన గళమై వస్తున్న మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు.. మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి అని సూచించారు..
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కొత్త సభ్యులను చేరుస్తారా లేదా కొందరిని తప్పిస్తారా అన్న విషయంలో తుది నిర్ణయం హైకమాండ్దే అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసులను చట్ట ప్రకారం ముందుకు తీసుకెళతామని తెలిపారు. తాను సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. కుల…