Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో బుమ్రా అరుదైన రికార్డు..
- తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన జస్ప్రీత్ బుమ్రా
- టీ20 అంతర్జాతీయ కెరీర్లో బుమ్రాకు 13 మెయిడిన్ ఓవర్లు
- ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు
- రిచర్డ్ నగార్వా 12 మెయిడిన్ ఓవర్ల రికార్డును అధిగమించిన బుమ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బుమ్రా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు.
తొలి ఓవర్ మెయిడిన్
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌ను బుమ్రా తన ఖచ్చితమైన లైన్, స్వింగ్, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టాడు. బుమ్రా వేసిన ఆరు బంతులను జద్రాన్ ఆచితూచి డిఫెండ్ చేయడం తప్ప పరుగులు రాబట్టలేకపోయాడు. దీంతో బుమ్రా తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా పూర్తి చేశాడు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ప్రపంచ రికార్డు
ఈ మెయిడిన్ ఓవర్‌తో బుమ్రా టీ20 అంతర్జాతీయ కెరీర్లో మొత్తం మెయిడిన్ ఓవర్ల సంఖ్య 13కి చేరింది. దీంతో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు జింబాబ్వే బౌలర్ రిచర్డ్ నగార్వాతో కలిసి 12 మెయిడిన్ ఓవర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న బుమ్రా.. ఇప్పుడు అతడిని అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు.
భారత్ తరఫున
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బౌలర్ల జాబితాలోనూ బుమ్రా చేరాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ 6 సార్లతో అగ్రస్థానంలో ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్ 2 సార్లు ఈ ఘనత సాధించాడు. హర్భజన్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా, ప్రవీణ్ కుమార్, బరిందర్ సరన్, జస్ప్రీత్ బుమ్రా ఒక్కోసారి తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా పూర్తి చేశారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!