తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అంతకుముందు జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించారు. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం అని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సీతక్క తెలిపారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు.