ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్ వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు. తాజాగా హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసును పోలీసులు చేదించారు. ప్రియుడితో భార్య స్వప్న హత్య చేయించినట్టు పోలీసులు తేల్చారు. ఐదు లక్షల సుపారితో పార్థసారధి హత్యకు భార్య స్వప్న, ప్రియుడు విద్యాసాగర్ ప్లాన్ చేశారని వెల్లడించారు. భార్య స్వప్న, ప్రియుడు విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో నలుగురు నిందితులు ఉన్నట్లు వెల్లడించారు.
Also Read:Uber: ‘Uber for Teens’ పేరుతో సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టిన ఉబర్
నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. గతకొద్ది రోజులుగా పార్థసారథి భార్య స్వప్నకు, విద్యాసాగర్ కు అక్రమ సంబంధం కొనసాగుతుందని తెలిపారు. తమ వదినపై అనుమానం ఉందని పార్థసారథి సోదరి హేమ ఫిర్యాదుతో విచారణ చేసిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాగా ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. బైక్ పై వెళ్తున్న అతన్ని పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.