రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- ఐటెల్ Muzik 450L ఫీచర్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల
- ఫోన్ ధర రూ.1,659గా నిర్ణయం
- 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే
- 2,500mAh బ్యాటరీ, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్
- F20 2-in-1 హై-ఔట్పుట్ స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
itel Muzik 450L: బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఐటెల్ (itel) సంస్థ భారత మార్కెట్లో కొత్త Muzik 450L ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. it5095L మోడల్ నంబర్‌తో వచ్చిన ఈ ఫోన్లో భారీ శబ్దంతో ఆడియో అందించే స్పీకర్, పెద్ద బ్యాటరీ, వైర్లెస్ ఎఫ్ఎం వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ ధరను రూ.1,659గా నిర్ణయించారు.
itel Muzik 450Lలో F20 2-in-1 హై-ఔట్పుట్ స్పీకర్‌ను అందించారు. మ్యూజిక్ వినడం, ఎఫ్ఎం రేడియో, కాల్స్ వంటి సందర్భాల్లో స్పష్టమైన, అధిక శబ్దాన్ని అందించేలా దీనిని రూపొందించారు. ముఖ్యంగా బయట శబ్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఆడియో వినేందుకు ఈ స్పీకర్ ఉపయోగపడుతుంది. స్పీకర్ పెద్దదిగా ఉన్నప్పటికీ ఫోన్ మందం 13.4 మి.మీ.గా ఉంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ఈ ఫోన్లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 2,500mAh బ్యాటరీని అందించారు. దీనికి టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, రికార్డింగ్ ఫీచర్ ఉన్నాయి. ఎఫ్ఎం వినేందుకు ప్రత్యేకంగా వైర్డ్ ఇయర్ఫోన్లు యాంటెనాగా అవసరం లేదు. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉండటంతో వైర్లెస్ ఆడియో పరికరాలను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
రోజువారీ వినియోగం కోసం ఇందులో అనేక ఫీచర్లను అందించారు. ఐకాన్ సపోర్ట్‌తో 1,000 వరకు కాంటాక్టులను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. వైబ్రేషన్ మోటార్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నాయి. యాక్సెసిబిలిటీ కోసం కింగ్ టాకర్ ఫీచర్‌ను అందించారు. అలాగే ‘0’ కీని ఎక్కువసేపు నొక్కితే ప్రస్తుత సమయాన్ని వాయిస్ ద్వారా తెలియజేసే షార్ట్‌కట్ కూడా ఉంది.
ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో VGA కెమెరాను అందించారు. చీకటి ప్రదేశాల్లో ఉపయోగించుకునేందుకు హై-ఇంటెన్సిటీ టార్చ్ కూడా ఉంది. ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బాక్స్‌లో హ్యాండ్‌సెట్‌తో పాటు టైప్-సీ యాక్సెసరీస్, ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్‌ను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1.30 లక్షలకు పైగా రిటైల్ అవుట్లెట్ల ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..