బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- శామ్సంగ్ గాలక్సీ A08 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్..
- 6.7 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ-యూ ఎల్సీడీ డిస్ప్లే..
- మీడియాటెక్ హీలియో G99 6nm ప్రాసెసర్..
- 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా
- 6,000mAh భారీ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A08: శామ్సంగ్ కొత్త గాలక్సీ A08 (Galaxy A08)ను 4జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రకటించింది. గతేడాది విడుదలైన Galaxy A07కు కొనసాగింపుగా A సిరీస్‌లో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పెద్ద డిస్ప్లే, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో Galaxy A08ను బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిస్ప్లే & ప్రాసెసర్
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ-యూ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ కోసం MediaTek Helio G99 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 4GB LPDDR4X RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రోSD కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
Also Read
- Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 లాంచ్.. 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్‌తో అద్భుతమైన ఫీచర్స్!
- Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
- ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
- HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
సాఫ్ట్వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఆరు తరాల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్లు, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని శామ్సంగ్ ప్రకటించింది.
కెమెరా సెటప్
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందించారు. ప్రధాన కెమెరాకు f/1.8 అపర్చర్, డెప్త్ సెన్సార్‌కు f/2.4 అపర్చర్ ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. డిస్ప్లే నాచ్‌లో 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో ఈ కెమెరా పనిచేస్తుంది.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ విషయానికి వస్తే.. Galaxy A08లో భారీ 6,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే ఫోన్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఇచ్చారు.
ధర
Samsung Galaxy A08 నేవీ బ్లూ, సిల్వర్, గ్రీన్ కలర్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 10,699 ఉక్రేనియన్ హ్రైవ్నియాగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.23,000గా ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ వంటి కొన్ని మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సెర్బియా, దక్షిణాఫ్రికా వంటి మరికొన్ని దేశాల వెబ్సైట్లలో కూడా Galaxy A08 లిస్టింగ్ కనిపిస్తోంది. దీంతో రానున్న వారాలు, నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్‌లో విడుదల తేదీ, ధరపై శామ్సంగ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం.. నార్త్ బ్లాక్‌కు 6 ఫైర్ ఇంజిన్లు!
-
AP Local Elections 2026: జెడ్పీ స్థానాలపై కూటమిలో ఉత్కంఠ.. మరో రెండు కావాలంటూ జనసేన డిమాండ్!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!