ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎస్సీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపాయి. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా 2 నిముషాలు మౌనం పాటించారు సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మాదిగ సంఘాల నేతలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేసినందుకు అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ కి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..
Also Read:Alleti Maheshwar Reddy: బడ్జెట్ను చూస్తుంటే.. ఆదాయం చరానా.. అప్పులు బరానా అన్నట్లు ఉంది..
“నన్ను ఒక్కడినే కాదు.. రాహుల్ గాంధీని… కేబినెట్ ని అభినందించాలి.. రాహుల్ గాంధీ నేనున్న అని చెప్పడం తో ధైర్యం వచ్చింది.. దామోదర రాజనర్సింహ కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ తీసుకో అంటే నాకు వద్దు అన్నారు.. నా పనే నేను ఎక్కువ చేసుకున్న అనుకుంటారు అని వద్దన్నారు.. 199 పేజీల విశ్లేషణ ఇచ్చారు కమిషన్ ఛైర్మన్. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాని.. వర్గాలను కూడా గుర్తించాం.. ఇప్పుడు తొమ్మిది కాదు..పావు తక్కువ పది మీ రిజర్వేషన్. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు.. మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం.. నేను ఉన్న కాబట్టి వేగంగా సుప్రీం కోర్టు తీర్పు అమలు చేశా.. నాకు మొదటి నుండి మాదిగ పిల్లలే నా వెంట ఉన్నారు.
Also Read:Beerla Ilaiah: అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్..
మీకు సహనం ఎక్కువ.. పదేళ్లు వేచి చూశారు.. నాకు అవకాశం ఇచ్చారు.. సుప్రీం కోర్టు లో కేసులు వాయిదా పడుతున్నాయి.. అందుకే నేనే మంచి అడ్వకేట్ నీ పెట్టీ పంపిన.. మందకృష్ణ తో నాకేం విభేదం లేదు.. కానీ ఆయన నా కంటే… కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు.. మీ జాతికి న్యాయం చేయాలని అనుకున్న.. బిల్లుకు ప్రాసెస్ ఉంటది.. అందుకే పకడ్బందీ గా చేశాం.న దామన్న నీ ముందు పెట్టీ అమలు చేశాం.. బిల్లు అమల్లోకి వచ్చేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వను అని చెప్పినా.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.. పదేళ్లు నాతో జాతి నడుస్తుంది.. పొలం కాడా మీకు.. మాకే కదా సంబంధం.. మార్చిపోతమా.. ఓయూ కి వీసీ ఇచ్చినా.. బాసర ఐఐఐటీకి వీసీగా మాదిగకు అవకాశం ఇచ్చాం.. ఉస్మానియా ప్రిన్సిపాల్ మాదిగ నీ వేశాం.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన అమ్మాయే.. మా వాళ్ళను పక్కన పెట్టీ కూడా మీకు అవకాశం ఇచ్చిన.. మీకు అన్యాయం అయ్యింది అని.. అవకాశం ఇచ్చాం..
Also Read:kangana : నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
ఇవాళ్టి తో ఐపోలేదు. నేను ఉన్నంత వరకు మీ వాడే కుర్చీలో ఉన్నాడు అనుకోండి.. నాకు పేరు తప్పా.. ఇంకేం ఆలోచన లేదు.. చిలక్కి చెప్పినట్టు చెప్పినా.. చింత స్వామి నాకు కాలేజి నుండి తెలుసు.. ఆవేశం తగ్గించి..ఆలోచన పెంచుకోండి. బుడగ జంగాలు ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది.. కొంత ఆలస్యం అవ్వచ్చు..ఓపిక గా ఉండండి.. మీరు ఎవ్వరితో కొట్లాడకండి.. మీకేం కావాలో చేయాలో చేయడానికి మేము ఉన్నాం. ఇకపై వరుసగా నోటిఫికేషన్ లు.. పిల్లల్ని చదివించండి.. రాహుల్ గాంధీ కోసం ఓ సభ పెట్టండి.. మీరు ధర్మ యుద్ధం సభ పెట్టినప్పుడు నేను అండగా ఉన్న.. మీరు కూడా అండగా ఉండండి.. అభినందన కంటే గాంధీ కుటుంబానికి ఏం కావాలి అని ఉండదు” అని సీఎం రేవంత్ అన్నారు.