CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో 2020 మార్చిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి సహా మరికొందరిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసును ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ, జన్వాడ ఏరియా నిషిద్ధ ప్రాంతం కాదని స్పష్టం చేశారు.
Beerla Ilaiah: అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్..
పోలీసులు అనవసరంగా ఈ కేసును నమోదు చేశారని తెలిపారు. పైగా, ఈ కేసులో రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు ప్రయోగించారని వాదించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కూడా, డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తరఫు వాదనలను పరిశీలించిన హైకోర్టు, 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి అనుకూలమైన తీర్పు లభించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కేసు కొట్టివేతతో, 2020లో నమోదైన వివాదం ముగిసినట్టయింది.
Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం