డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read:Maruti Brezza: తక్కువ ఈఎంఐతో ఈ కారును కొనేయండి.. డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలంటే..?
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్ పై మనం బీజేపీని అడ్డుకోవాలి.. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది.. వాజ్ పేయి కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు.. నరేంద్ర మోడీ కూడా అదే పని చేయాలి.. లోక్ సభ సీట్లు పెంచకూడదు.. జనాభా ప్రతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదు.. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశామని అన్నారు.
Also Read:Abhishek Bachchan : ఐశ్వర్య ఫోన్ కాల్స్ నన్ను ఒత్తిడికి గురి చేస్తాయి..!
ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కాలేదు.. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది.. దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ.. మనకు తిరిగి వచ్చేది తక్కువ.. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి మనకు ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే.. బీహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది ఆరు రూపాయలు.. యూపీకి రూపాయికి 2 రూపాయల 3 పైసలు వెనక్కి ఇస్తున్నారు.. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది.. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా అని సీఎం రేవంత్ కేంద్రాన్ని ప్రశ్నించారు.