Ganja Smuggling: భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ, తనిఖీల్లో ఉన్న కానిస్టేబుల్ను ఢీకొట్టి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ యోగేంద్ర చారి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ తెల్లవారుజామున భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిపై గంజాయి స్మగ్లర్లు బైక్తో దాడి చేశారు.…
Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత…
Jagdeep Dhankar: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నేడు (ఆదివారం) కందిలోని ఐఐటీ హైదరాబాద్కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ (IIIT) డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉప రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్,…
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. అయితే టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరింది.
SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను…