తెలంగాణలో మున్సిపాలిటీ పాలకమండళ్ళ పదవీకాలం ముగిసి చాలా రోజులైంది. వాటికి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయన్న క్లారిటీ లేదు. కానీ... ఇంకా పది నెలల దాకా పదవీకాలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతోంది బీఆర్ఎస్. కమాన్... మీరు రెడీ అవండి. మళ్ళీ మీకే టిక్కెట్లు ఇస్తామని గులాబీ పెద్దలు అనడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందట.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ…
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ పలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల…
తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అర్జెంట్‌గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపిందని, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను…
హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు అండగా నిలబడుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరుస్తుందన్నారు. అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్…
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. మూసీ ప్రక్షాళణ పేరుతో ప్రభుత్వం 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఅర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ కాంగ్రెస్…
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న…